Asianet News TeluguAsianet News Telugu

మీ ప్రభుత్వానికి వారి శాపం తగులుతుంది.. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొడుకు గుర్తొస్తున్నాడని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రుల శాపం ప్రభుత్వానికి తగిలి తీరుతుందని అన్నారు.  

TPCC Revanth Reddy Reacts On KTR Tweet KRJ
Author
First Published Oct 12, 2023, 12:19 AM IST | Last Updated Oct 12, 2023, 12:19 AM IST

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొడుకును మిస్సవుతున్నానంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అమెరికా వెళ్లిన కొడుకు గుర్తుకొచ్చి ప్రాణం తల్లడిల్లుతోందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో  ఎంతో మంది విద్యార్థులు తమ కుటుంబాలకు దూరమై.. నానా అవస్థలు పడుతున్నారని, ఆ బిడ్డల తల్లిదండ్రుల కోస కేసీఆర్ సర్కారుకు ఖచ్చితంగా తగులుతుందని విమర్శించారు. ఈ మేరకు ఇలా ట్వీట్ చేశారు.

కేటీఆర్.. దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా ?.. కొడుకుతో  కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా అని ఆగ్రహం వ్యక్తం  చేశారు. సర్కారు హాస్టళ్లలో పెట్టే తిండి తినలేక ఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా ? అని నిలదీశారు.  

కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా? మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా? అని కేటీఆర్ పై రేవంత్ రెడ్డి విరుచుకపడ్డారు. తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి, ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి, ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios