2014లో టీఆర్ఎస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలిచి దానికి తోడు మరో ముగ్గురు ఎంపీలను లాక్కొన్నారన్నారు. మొత్తం 15 మంది ఎంపీలు చేతుల్లో ఉండి కూడా ఎంఐఎం వాళ్ల మిత్రపక్షంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఏం చేసిందని ఉత్తమ్ ప్రశ్నించారు.

బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ, 16 మంది ఎంపీలు చేతులో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేయలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న ఖాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ సాధించలేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ తెప్పించలేపోయారని, ఏ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా సాధించలేకపోయారని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.

చట్టంలో ఉన్న అంశాలు సాధించలేని టీఆర్ఎస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని ఉత్తమ్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణకు అన్ని అంశాల్లో మేలు జరుగుతుందన్నారు.