Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లిన రేవంత్.. ఆయనతో భేటీ అయ్యారు. 

tpcc president revanth reddy meets clp leader bhatti vikramarka ksp
Author
Hyderabad, First Published Jul 6, 2021, 4:41 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లిన రేవంత్.. ఆయనతో భేటీ అయ్యారు. రేపు టీపీసీసీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భట్టిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు మధ్యాహ్నం 3 గంటలకు మాజీ మంత్రి శ్రీధర్ బాబును దోమలగూడాలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. భట్టితో భేటీ అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్లురవి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను రేవంత్ కలవనున్నారు.  ఉత్తమ్‌తో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై మాట్లాడతారని సమాచారం. అలాగే రేపటి టీపీసీసీ బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లపైనా ఉత్తమ్‌తో రేవంత్ చర్చించే అవకాశాలు ఉన్నాయి

Also Read;రేపు రేవంత్ ప్రమాణ స్వీకారం.. 5వేల బైక్ లతో భారీ ర్యాలీ...

అంతకుముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన రేవంత్ రెడ్డిని కలిసేందుకు భట్టి విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి చర్చించింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన భట్టి విక్రమార్కతో ఆయన సోదరుడు మల్లు రవి భేటి కావడం చర్చనీయాంశమైంది.

ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చేందుకు భట్టితో భేటి అయిన మల్లు రవి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎంత ముఖ్యమో సీఎల్పీ నాయకుడు అంతే ముఖ్యమన్నారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణం చేసే క్రమంలో పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలెవరినీ ఇబ్బంది పెట్టొద్దని ఆయన కోరారు. కార్యకర్తలు కూడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్‌కు తరలిరావాలని పిలుపునిచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios