మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో అనుచిత ప్రవర్తనకు గాను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ మాట్లాడుతూ.. పార్టీ పెద్దలు, కార్యకర్తల సమక్షంలో సర్వే ఓ వీధి రౌడీలా వ్యవహారించారని మండిపడ్డారు. నా చొక్కా చింపడంతో పాటు తనపై వాటర్ బాటిల్ విసిరారని చెప్పారు.

అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాల పట్ల సత్యనారాయణ అసభ్యకరంగా వ్యవహారించారన్నారు. కుంతియాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై వాటర్ బాటిల్ విసిరినందుకు పార్టీ క్రమశిక్షణా సంఘం సర్వేపై వేటు వేసింది.

పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సర్వే... ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు చెబుతుంటే అది నచ్చనివారు తనపైకి కొందరిని ఉసిగొల్పారని ఆరోపించారు.