ముందస్తు ఎన్నికలు: ఢిల్లీలో కాంగ్రెస్ వార్ రూమ్‌కి హాజరైన ఉత్తమ్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 6, Sep 2018, 12:32 PM IST
tpcc chief uttamkumar reddy attend war room meeting
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగుతుండటంతో అన్ని పార్టీలు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు తమ తమ కీలకనేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ స్కెచ్ రెడీ చేసుకుంటున్నాయి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగుతుండటంతో అన్ని పార్టీలు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు తమ తమ కీలకనేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ స్కెచ్ రెడీ చేసుకుంటున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్‌తో సమానంగా దూకుడు మీదుంది.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కోశాధికారులతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్ రూమ్‌లోకి అడుగుపెట్టారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఉత్తమ్ కుమార్‌తో  రాహుల్, ఇతర ఏఐసీసీ అగ్రనేతలు విడిగా సమావేశమయ్యే అవకాశం ఉంది.

loader