హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. 

నల్గొండ ఎంపీగా గెలుపొందడంతో ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సమర్పించాలని చూశారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఉత్తమ్ భార్య పద్మావతి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరగుతోంది. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆమె కోదాడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇకపోతే హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సైదిరెడ్డి మరోసారి పోటీకి దిగనున్నారని తెలుస్తోంది.   

వీడియో

"