హైదరాబాద్: శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ను బుజ్జగించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయన ఇంటికి చేరారు. బిక్షపతి యాదవ్ ఇవాళ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి చేరుకొన్నారు.

2018  అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి టికెట్ ను బిక్షపతి యాదవ్ ఆశించారు. కానీ మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్ టీడీపీకి కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన బిక్షపతియాదవ్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పట్లో బుజ్జగించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు బిక్షపతియాదవ్ ఇంటికి చేరుకొని ఆయనను అప్పట్లో బుజ్జగించడం అప్పట్లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

బిక్షపతియాదవ్ ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. దీంతో బిక్షపతి యాదవ్ ను బుజ్జగించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారు.