హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను  నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడే  అరెస్ట్ చేశారు.
. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడే  అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ లుంబినీ పార్క్ నుండి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు  ర్యాలీగా రాజ్ భవన్ కు వెళ్లాలని భావించారు. లుంబినీ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్యలను పోలీసులు  అరెస్ట్ చేశారు.

ఛలో రాజ్‌భన్ కార్యక్రమాన్ని వెళ్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ,శ్రీధర్ బాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడంతో  కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.