తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను టీఆర్ఎస్ పార్టీ, ఆపద్దర్మ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆరోపించారు. అయితే ఈ  ఉల్లంఘనలను తెలంగాణలోని ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమకు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పై అనుమానాలున్నాయని ఉత్తమ్ ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను టీఆర్ఎస్ పార్టీ, ఆపద్దర్మ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆరోపించారు. అయితే ఈ ఉల్లంఘనలను తెలంగాణలోని ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమకు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పై అనుమానాలున్నాయని ఉత్తమ్ ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వ సంస్థకు చెందిన ఆర్టీసి బస్సులపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలతో వున్న అడ్వర్‌టైజ్‌మెంట్లు ఎందుకు తొలగించడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన భారీ హోర్డింగ్ , ప్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇవన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేశారని...టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో కాదని అన్నారు. హోర్డింగ్ లు, ప్రచార ప్లెక్సీలు వెంటనే తీసేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

ఈ విషయంలో పిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా రెండు రోజుల్లో కలవనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. అప్పుడు కూడా మార్పు రాకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ లపై కూడా పలు అనుమానాలున్నాయని...ఈవీఎం టెస్టింగ్ నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా పెట్టాలని సీఈసి ని కోరనున్నట్లు ఉత్తమ్ తెలిపారు.

రేపటి నుండి రాష్ట్రంలో జనసంపర్క్ అభియాన్ యాత్ర నిర్వహించనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ అడ్డదారిలో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందని తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్ కలిసి గజదొంగల కంటే ఎక్కువ తెలంగాణాను లూటీ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో'' అన్న నినాదంతోనే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు.

అపద్దర్మ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందంటూ భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం సీఎస్ ను కలిసి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రచారం కల్పించేలా వున్న హోర్డింగ్ లు, ప్రచార ప్లెక్సీలు వెంటనే తీసేయాలని భట్టి బృందం ఫిర్యాదులో పేర్కొంది.