ఓయూలో రాహుల్ టూర్‌కి అనుమతి నిరాకరణ: నేడు ఉస్మానియా వీసీతో రేవంత్ రెడ్డి భేటీ


ఉస్మానియా యూనివర్శిటీ వీసీ రవీందర్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ కలవనున్నారు. రాహుల్ గాంధీ ఓయూ టూర్ కి అనుమతివ్వాలని కోరనున్నారు. అయితే ఇప్పటికే రాహుల్ టూర్ కి ఓయూ అధికారులు అనుమతివ్వలేదు.

TPCC Chief Revanth Reddy To Meet Osmania Vice Chancellor Ravinder

హైదరాబాద్:ఉస్మానియా యూనివర్శిటీ వీసీ Ravinderతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు భేటీ కానున్నారు.రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతివ్వాలని వీసీని కోరనున్నారు రేవంత్ రెడ్డి.

రాజకీయపార్టీల సభలు, సమావేశాలను అనుమతివ్వకూడదని గతంలో తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా తాము Rahul Gandhi  సమావేశానికి అనుమతి ఇవ్వడం లేదని Osmania University వీసీ రవీందర్ సోమవారం నాడు అధికారికంగా ప్రకటించారు. రాహుల్ గాంధీ టూర్ విషయమై  శనివారంనాడు ఉస్మానియా యూనివర్శిటీ గవర్నింగ్ బాడీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాహుల్ టూర్ విషయమై చర్చించారు. రాజకీయ పార్టీల సభలకు అనుమతివ్వకూడదని గతంలో తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగానే రాహుల్ టూర్ కి అనుమతివ్వకూడదని నిర్ణయం తీసుకొన్నారు.

ఈ విషయమై తెలంగాణ PCC  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది హైకోర్టు . ఓయూలో రాహుల్ గాంధీ టూర్ విషయమై విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించాలని Telangana High Court ఉస్మానియా వీసీని కోరింది.

ఇదిలా ఉంటే ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీ వీసీ రవీందర్ ను టీపీసీసీ చీఫ్ Revanth Reddy  కలవనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ విద్యార్ధులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యార్ధుల సమస్యలు తీరాయా లేదా అనే అంశాలతో పాటు ఇతర విషయాలపై చర్చించనున్నారు.రాహుల్ గాంధీ టూర్ రాజకీయాలతో సంబంధం లేనిదని కాంగ్రెస్ నేతలు స్పస్టం చేస్తున్నారు. 

రాహుల్ గాంధీ మీటింగ్ కి అనుమతిస్తే ఇతర సంఘాల నుండి కూడా తమపై ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉందని ఉస్మానియా యూనివర్శటీ వీసీ చెబుతున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ  మీటింగ్ కి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా ఓయూ అధికారులు చెబుతున్నారు.  వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాహుల్ టూర్ కి అనుమతివ్వ లేదని చెబుతున్నారు.

రాహుల్ గాంధీ టూర్ కి అనుమతివ్వకపోవడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఓయూకి వస్తే తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే రాహుల్ ను ఓయూకి రాకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఓయూలో టీచర్ ఫ్యాకల్టీ సగానికి సగం పడిపోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఓయూని ఉపయోగించుకొన్న కేసీఆర్ ఆ తర్వాత ఓయూని పట్టించుకోలేదని కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తమతో పాటు టీఆర్ఎస్ నేతలు ఓయూకి వచ్చే సాహాసం చేయగలరా అని కూడా  కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఓయూలో రాహులల్ గాంధీ టూర్ కి రాజకీయాలతో సంబంధం లేదని కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి మరోసారి ఓయూ వీసీ రవీందర్ దృష్టికి తీసుకు రానున్నారు. అయితే ఓయూలో రాహుల్ టూర్ కి ఓయూ అధికారులు అనుమతివ్వకపోయినా కూడా రాహుల్ ను ఓయూకి తీసుకెళ్తామని కూడా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఓయూ వీసీ రవీందర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios