Asianet News TeluguAsianet News Telugu

ఎంఐఎంకి కేసీఆర్ మిత్ర ద్రోహం చేస్తారా? : రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ కేబినెట్ నిర్ణయంపై స్పందించారు. టీచర్లు లేకుండానే ఆంగ్ల మాధ్యమాన్ని ఎలా బోధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇవాళ మీడియా ప్రతినిధులతో రేవంగ్ రెడ్డి చిట్ చాట్ చేశారు.

TPCC Chief Revanth Reddy Serious Comments  on KCR
Author
Hyderabad, First Published Jan 18, 2022, 3:01 PM IST

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 

టీపీసీసీ చీఫ్ Revanth Reddy  మంగళవారం నాడు  మీడియా ప్రతినిధులతో Chit chat చేశారు.Telangana Cabinet లో ప్రభుత్వ స్కూల్స్ లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది. అంతేకాదు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో పీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా నిర్ణయం తీసుకొంది.అయితే ఈ విషయమై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చట్టం రూపొందించనున్నారు.

ఈ విషయమై ఇవాళ రేవంత్ రెడ్డి  చిట్ చాట్ లోస్పందించారు. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ విద్యాసంస్థల్లో  ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా ఇంగ్లీష్ మాధ్యం ఎలా బోధిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేజీ టూ పీజీ విద్యా విధానం అమలు కావాలంటే టీచర్ పోస్టులను భర్తీ చేయాలనే విషయం కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు.  తెలంగాణలో విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

విద్యా హక్కు చట్టం అమల్లో ఉన్నా  అమలు కాని విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారంగా ప్రైవేట్ కాలేజీల్లో పేద విద్యార్ధులకు 25 శాతం ఉచితంగా ఆడ్మిషన్లు ఇవ్వాలని ఆయన గుర్తు చేశారు.

 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుందన్నారు.  ఈ చట్టం గురించి అడిగితే 
 యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ చెబుతున్నాడన్నారు. . Teachers  భర్తీ నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలలను అన్నింటినీ మూసివేశారని ఆయన విమర్శించారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తే పేదలు బాగుపడుతారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

Kcr రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమాలను చేపట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క లేదన్నారు. అందుకే Modi  వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదని చెప్పారు. 

పాఠశాలలో కరోనా వచ్చి మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదన్నారు.  అయినా వాటిని మూసివేశారన్నారు. బయట పార్టీలు, పబ్ ల వల్ల మరణాలు జరుగుతున్నాయన్నారు. అయినా వాటిని ఎందుకు నియంత్రణ చేయరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విద్యకు పెట్టె నిధులు కేసీఆర్ దృష్టిలో ఖర్చున్నారు. కానీ సమాజం దృష్టిలో పెట్టుబడిగా రేవంత్ రెడ్డి చెప్పారు.

 ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టే జార్జ్ రెడ్డిలాంటి లీడర్లు పుట్టారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయన్నారు. ఉద్యోగుల భర్తీ లేకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదన్నారు రేవంత్ రెడ్డి

దళితబంధు మంచి పథకం అమలు చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ని చూస్తే  ఆ  పార్టీ పని ముగిసింది అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదన్నారు.  పక్క పార్టీల నుంచి తీసుకున్న నేతలతో బీజేపీ కమిటీలు వేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆ కమిటీలు చూస్తెనే  బీజేపీ దివాళా తీసిందని అర్థం అవుతుందన్నారు.

టీఆర్ఎస్ యూపీలో SPకి మద్దతుగా ప్రచారం చేస్తే MIM కి కేసీఆర్? మిత్రద్రోహం చేస్తుండా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎంఐఎం తో పొత్తు పెట్టుకొని యూపీలో ఆ పార్టీకి కాకుండా SP కి ప్రచారం చేస్తారా  రేవంత్ రెడ్డి కేసీఆర్ ను అడిగారు. 

క్రిమినల్స్‌తో చర్చలకు తాను సిద్దం

కేటీఆర్ క్రిమినల్స్ తో చర్చలు జరపకపోవచ్చు...  కానీ తాను  420, క్రిమినల్స్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి చెప్పారుకేటీఆర్ చర్చలు జరపాలి అంటే సినిమా గ్లామర్ ఉండాలన్నారు.  అది నా దగ్గర లేదు కదా అని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. తాము శైవులం కాబట్టే  వైష్ణవులు మమ్ములను అవమానిస్తున్నారా? అని రేవంత్ రెడ్డి అడిగారు. 

జీయర్ స్వామి అంటే గౌరవం అంటూనే...

చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమం నుంచి తమకు ఆహ్వానం ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 
రియల్ ఏస్టేట్ వ్యవస్థ కోసం చెట్లను నరికి రోడ్లు వేస్తున్నారన్నారు. చిన్నజీయర్ స్వామీజీ పై తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. రియల్ ఏస్టేట్ బ్రోకర్ ను పక్కనపెట్టుకొని తిరిగితేనే  తనకు అనుమానాలు వస్తున్నాయన్నారు. దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వామీజీ ముందు మాత్రం సమాధానం  కనిపించడం లేదన్నారు.  ప్రధాని, రాష్ట్రపతి పర్యటన అడ్డం పెట్టుకొని రామేశ్వర్ రావు ఆస్తులను పెంచడానికి వ్యవస్థను ప్రభుత్వం వాడుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios