Asianet News TeluguAsianet News Telugu

రెడ్లకు పగ్గాలిస్తేనే.. పార్టీలకు మనుగడ, వైఎస్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి : రేవంత్ సంచలన వ్యాఖ్యలు

రెడ్డి సామాజిక వర్గంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ల చేతిలో పార్టీలను పెట్టాలని ఆయన సూచించారు. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి పతనమయ్యాడని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు

tpcc chief revanth reddy sensational comments reddy community
Author
Hyderabad, First Published May 22, 2022, 6:45 PM IST

రెడ్డి సామాజిక వర్గంపై (reddy community) టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజకీయ పార్టీలకు ఆయన సూచనలు చేశారు. మీ పార్టీలు గెలవాలన్నా.. రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టాలని సూచించారు. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి.. పతనమయ్యాడని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రెడ్లకు అవకాశం ఇవ్వండి.. రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తానంటూ సవాల్ విసిరారు. దానికి ఉదాహరణగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని (ys rajasekhara reddy) చూపారు.

రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు… నష్టపోలేదని ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారని.. దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు, బలహీన వర్గాలకు దూరం అవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రెడ్లు సీఎం, ప్రధాని.. రాష్ట్రపతిని బీసీ, ఎస్సీ వర్గాలు చేశాయంటే మనమీద వారికి వుండే నమ్మకమే కారణమని రేవంత్ అన్నారు.

వ్యవసాయం వదిలేసి అందరికీ దూరం అవుతున్నామని... రెడ్డి సోదరులు వ్యవసాయం వదలొద్దని ఆయన సూచించారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి.. పద్మనాయకులను దగ్గరికి తీశాడని రేవంత్ గుర్తుచేశారు. పద్మ నాయకులు అంటే వెలమలని, రెడ్లను పక్కన పెట్టి..వెలమలను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. ఆనాటి నుండి.. ఈనాటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు రేవంత్ రెడ్డి.

అంతకుముందు తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ. 2500లకు కొనుగోలు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతు Rythu Racha Banda  కార్యక్రమంలో భాగంగా టీపీసీసీచీఫ్  Revanth Reddy  ఆదివారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని తునికి మెట్లలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట రుణాలకు సంబంధించిన బకాయిలను చెల్లించవద్దని కూడా రేవంత్ రెడ్డి సూచించారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో Congress  పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు.

KCR ఢిల్లీ వెళ్లారు. KTR థావోస్ వెళ్లాడు. రాష్ట్ర ప్రలు సంతోషంగా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలంటే కేసీఆర్, కేటీఆర్ లను Telangana  పొలిమేరలు దాటించాలని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ చేతిలో మోసపోనివారు ఎవరైనా ఉన్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం రైతులు ప్రతి క్వింటాల్ పై వెయ్యి రూపాయాలు నష్టపోతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios