కామారెడ్డికి బూచోడోస్తున్నాడు .. మీ భూములు జాగ్రత్త : సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సెటైర్లు

కేసీఆర్ పాలనకు కామారెడ్డి చరమగీతం పాడబోతోందని.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఏ రోజూ కేసీఆర్ సచివాలయానికి రాలేదని రేవంత్ చురకలంటించారు. మీ భూములను ఆక్రమించుకునేందుకు బూచోడు వస్తున్నాడని సెటైర్లు వేశారు.

tpcc chief revanth reddy satires on telangana cm kcr at kamareddy ksp

తెలంగాణ ప్రజల భవిష్యత్తును కామారెడ్డి నిర్ణయించబోతోందోన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారం కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కామారెడ్డి తీర్పు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనకు కామారెడ్డి చరమగీతం పాడబోతోందని.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఏ రోజూ కేసీఆర్ సచివాలయానికి రాలేదని రేవంత్ చురకలంటించారు. కామారెడ్డి రైతు లింబయ్య సచివాలయం ముందే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఫైర్ అయ్యారు. 

ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు ధాన్యంపైనే గుండె ఆగి ప్రాణాలు కోల్పోయాడని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ రోజు కేసీఆర్‌కు కోనాపూర్ గుర్తొచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా అని రేవంత్ నిలదీశారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఏం చేశారు.. గజ్వేల్‌ను బంగారు తునక చేసి ఉంటే కామారెడ్డికి ఎందుకు పారిపోయి వచ్చావని ఆయన ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలను కేసీఆర్ నమ్మించి నట్టేట ముంచారని.. కామారెడ్డి చుట్టూ వున్న భూములపై కేసీఆర్ కన్ను పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

Also Read: మేం డబ్బులు పంపిస్తే బీఆర్ఎస్ నిద్ర పోగలదా : డీకే శివకుమార్ వ్యాఖ్యలు

గంప గోవర్ధన్ కామారెడ్డికి వచ్చి చేయాలని కోరాడని కేసీఆర్ చెబుతున్నారని చురకలంటించారు. కేసీఆర్ పోటీ చేసేందుకు సిద్ధిపేట, సిరిసిల్ల లేవా అని రేవంత్ ప్రశ్నించారు. బీసీ నేత గంప గోవర్ధన్ సీటే కావాల్సి వచ్చిందా అని ఆయన నిలదీశారు . రైతు రుణమాఫీ జరగలేదు, పండించిన పంట కొనే దిక్కు లేదని రేవంత్ దుయ్యబట్టారు. మూడోసారి కేసీఆర్‌కు అధికారం కావాలట అంటూ ఆయన చురకలంటించారు. 

తాను ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపిస్తారని.. కానీ కేసీఆర్‌ను ఓడించేందుకే కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తున్నానని రేవంత్ తెలిపారు. 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలను, ఇద్దరు ఎంపీలను కొన్నది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. వీరందరినీ ఎన్ని కోట్లు పెట్టి కొన్నావు.. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఈడీ, సీబీఐ విచారణకు తాను సిద్ధమని రేవంత్ సవాల్ సవాల్ విసిరారు. మీ భూములను ఆక్రమించుకునేందుకు బూచోడు వస్తున్నాడని సెటైర్లు వేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios