నేను ఉండగా ఆమె నాయకత్వం ఉండదు: వైఎస్ షర్మిలపై రేవంత్ రెడ్డి సంచలనం

వైఎస్ షర్మిలపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు.  షర్మిల  ఏపీ కాంగ్రెస్ లో  పనిచేస్తే స్వాగతిస్తానని  చెప్పారు.

TPCC  Chief  Revanth Reddy  Sansational Copmments on  YSRTP Chief  YS Sharmila lns

హైదరాబాద్:తాను  ఇక్కడ ఉన్నన్ని రోజులు  వైఎస్  షర్మిల నాయకత్వం  తెలంగాణలో ఉండదని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  తేల్చి  చెప్పారు.సోమవారంనాడు గాంధీ భవన్ లో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ  రాష్ట్రం  తెచ్చుకొంది  తెలంగాణ వాళ్లు  పాలించుకోవడం కోసమేనన్నారు. వైఎస్ 
ఫర్మిల వచ్చి   తెలంగాణలో  నాయకత్వం వహిస్తామంటే  ఊరుకుంటామా అని  రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో పనిచేస్తే స్వాగతిస్తానని  ఆయన  చెప్పారు. వైఎస్  షర్మిల ఏపీపీసీ చీఫ్ అయితే  సహచర పీసీసీ చీఫ్ గా  కలుస్తానన్నారు.

also read:వైఎస్ఆర్‌టీపీని విలీనం చేయం, ఆ పార్టీలతో పొత్తుల్లేవు : తేల్చేసిన వైఎస్ షర్మిల

కర్ణాటక  డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్ ను  ఇటీవల  వైఎస్ షర్మిల  కలిశారు.  కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీని వైఎస్ షర్మిల  విలీనం  చేస్తారని  ప్రచారం సాగింది.ఈ  ప్రచారంపై  వైఎస్ షర్మిల మండిపడ్డారు.  తమ పార్టీని ఏ పార్టీలో విలీనం చేయబోనని  చెప్పారు.  అయితే  వైఎస్ షర్మిలపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  గతంలో కూడ  ఇదే రకమైన  విమర్శలు  చేశారు.  తెలంగాణ తెచ్చుకొని ఇతరుల పెత్తనాన్ని సహిస్తామా అని  ప్రశ్నించారు.ఈ వ్యాఖ్యలపై  వైఎస్ షర్మిల  అదేస్థాయిలో  స్పందించారు.   సోనియాతో లింకు పెట్టి  రేవంత్ రెడ్డిపై  వైఎస్ షర్మిల విమర్శలు  చేశారు

కర్ణాటక లో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన  తర్వాత తెలంగాణలో  కాంగ్రెస్ నేతల్లో జోష్ వచ్చింది.  మరో ఆరు మాసాల్లో  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి.  కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో  షర్మిల  సమావేశం కావడంపై తెలంగాణ  రాజకీయాల్లో  చర్చ  సాగుతుంది.  కర్ణాటక  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో  వైఎస్ షర్మిల మధ్య   పరిచయం కారణంగా  అతడిని కలిసి ఉండొచ్చని   కర్ణాటక  ఇంచార్జీ  మాజీ మంత్రి శ్రీధర్ బాబు  నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే .

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios