Asianet News TeluguAsianet News Telugu

జీవో 111 ఎత్తివేతపై ఎన్‌జీటీలో ఫిర్యాదు చేస్తాం: రేవంత్ రెడ్డి

111  జీవో  ఎత్తివేతపై   ఎన్జీటీని ఆశ్రయించనున్నట్టుగా  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  చెప్పారు. 
 

TPCC Chief  Revanth Reddy  Responds  On  G. O.  111 Cancel lns
Author
First Published May 24, 2023, 1:52 PM IST

హైదరాబాద్:2019  జనవరి  తర్వాత  111 జీవో పరిధిలో  కొన్న భూముల వివరాలు బయటపెట్టాలని   టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  డిమాండ్  చేశారు.బుధవారంనాడు  ఆయన   హైద్రాబాద్ లో  మీడియాతో మాట్లాడారు.  జీవో  111  ఎత్తివేతపై  ఎన్జీటీకి వెళ్తామన్నారు. 111జీవో  ఎత్తివేత  వెనుక ఇన్ సైడర్ ట్రేడింగ్  జరిగిందని ఆయన  ఆరోపించారు.కేసీఆర్ కుటుంబ సభ్యులు  111 జీవో  పరిధిలో భూములు  కొన్నాక  ఈ జీవో ను ఎత్తేశారన్నారు. 

ఏ పార్టీ నేతలు  111  జీవో  పరిధిలో  భూములు కొన్నా ఆ వివరాలు బయటపెట్టాలని  ఆయన  డిమాండ్  చేశారు.  ఈ నెల  18న  జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో  111  జీవో ను ఎత్తివేస్తూ  కేబినెట్  నిర్ణయం తీసుకుంది.  111 జీవో ఎత్తివేతను  విపక్షాలు తప్పుబడుతున్నాయి.   ఈ జీవో  ఎత్తివేత తో  రైతుల  కంటే  రాజకీయ నేతలు  బడా నేతలకు  లాభం  జరుగుతుందనే విమర్శలు  కూడా లేకపోలేదు.

also read:ఔటర్ రింగ్ రోడ్డు లీజులో అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు : రేవంత్ రెడ్డి

111  జీవో ఎత్తివేతతో  ఈ ప్రాంతంలో  భూముల ధరలు పెరగనున్నాయి. 111  జీవో  కారణంగా ఇప్పటివరకు  ఈ ప్రాంతంలో  భూముల క్రయ విక్రయాలపై  రైతులు  ఇబ్బంది పడ్డారు.  111  జీవో ఎత్తివేత్తతో  ఇబ్బందులు  తొలగిపోనున్నాయని  ఈ ప్రాంత  రైతులు  అభిప్రాయంతో  ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios