జానారెడ్డి మాకు అందరికీ రింగ్ మాస్టర్ అని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం నాడు నాగార్జున సాగర్ లో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.


నాగార్జునసాగర్: జానారెడ్డి మాకందరికీ రింగ్ మాస్టర్ లాంటి వాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.శుక్రవారం నాడు నాగార్జునసాగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశంలో టీపీసీసీ చీఫ్ Revanth Reddy పాల్గొన్నారు.గడ్కరీ టూర్ లో పాల్గొన్న కారణంగా ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గైర్హాజరయ్యారు.

కాంగ్రెస్ లో పులులు, సింహాలున్నాయన్నారు. నల్లమల అటవీ ప్రాంతం పక్కనే ఉన్న తాము పులులు, సింహాలు కావొచ్చన్నారు. కానీ మాకు మాత్రం జానారెడ్డే రింగ్ మాస్టర్ అని ఆయన తేల్చి చెప్పారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సమయ స్పూర్తితో పాటు ఒడుపుతో సమస్యలను పరిస్కరించే శక్తి Jana Reddy దని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాటం చేసే శక్తి కాంగ్రెస్ నాయకత్వానికి ఉందన్నారు.

చట్టసభల్లో జానారెడ్డి లేకపోవడం వల్ల చట్టసభల గౌరవమే తగ్గిపోయిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.జానారెడ్డి ఎక్కడికి వెళ్లినా కూడా ఆయన గౌరవం ఆయనకే ఉంటుందన్నారు.కానీ చట్టసభల్లో జానారెడ్డి లేకపోవడం వల్ల తెలంగాణ సమాజం గౌరవం తగ్గిందని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల్ని అభిమానంగా పులులు, సింహాలు అంటూ క్యాడర్ తమను పిలుచుకొంటున్నారన్నారు.ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ సర్కస్ లో పులులు, సింహాలను ఆడించే రింగ్ మాస్టర్ లాంటి వాడే జానారెడ్డి అని ఆయన చెప్పారు.KCR కేబినెట్ లో ఉన్నవారిలో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు అమ్ముకొనే వాళ్లతో పాటు భూ కబ్జాలకు పాల్పడేవాళ్లున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ల్యాండ్, శాండ్, మైన్, వైన్, మర్డర్లు, రేప్ లు చేసేవారున్నారన్నారు.

Nagarjuna Sagar ప్రాజెక్టును దేశ తొలి ప్రధాని నెహ్రు ప్రారంభించారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఇలాంటి ప్రాజెక్టును కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ జిల్లాలోని ప్రాజెక్టుల్లో మెజారిటీ ప్రాజెక్టులను తాము పూర్తి చేశామని కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ నేతలు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అబద్దాల పునాదులపై విజయం సాదించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నెల్లికల్లు ప్రాజెక్టును ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామని మంత్రి Jagadish Reddy ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.మూడు అడగులుండే మంత్రి జగదీష్ రెడ్డి ఆరు అడుగులు ఎగిరి ఈ హామీ ఇచ్చాడని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశాడు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఇసుక దందా చేస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఎంతో మంది ఉద్ధండులైన కాంగ్రెస్ నేతలను చట్టసభలకు పంపిన చరిత్ర ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2018లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారన్నారు. మిగిలిన 9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన గుర్తు చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు జిల్లాకు నిధులు తెచ్చారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

వరి ధాన్యం కొనుగోలు విషయమై కూడా రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పారు. వరంగల్ లో రాహుల్ గాంధీ సభను జయప్రదం చేయాలన్నారు. రైతుల కోసం యుద్ధం చేద్దామన్నారు. వరంగల్ లో రైతుల తుఫాన్ చేద్దామని రేవంత్ రెడ్డి కోరారు.