తెలంగాణ హత్యలు, అత్యాచార ఘటనలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సీఎం కేసీఆర్‌ను కోరారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (kcr) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. శాంతి భద్రతలపై అఖిలపక్షంలో చర్చిద్దామని ఆయన కోరారు. ప్రగతి భవన్‌కు తానే వస్తానన్న రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుకుందామన్నారు. మహిళా , స్వచ్ఛంద, పౌర రక్షణ దళాలలో చర్చించాలని లేఖలో వెల్లడించారు. క్లబ్స్, పబ్స్, డ్రగ్స్‌ను నియంత్రించుకుందామని , మన విశ్వనగర ఖ్యాతిని కాపాడుకుందామని రేవంత్ చెప్పుకొచ్చారు. 

అంతకుముందు బుధవారంనాడు Hyderabadలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మే 28వ తేదీన Minor Girl పై గ్యాంగ్ రేప్ జరిగిందని సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో చెప్పారన్నారు. Amnesia pub పబ్ నుండి మెర్సిడెజ్ బెంజ్ కారులో బాలికను తీసుకెళ్లిన నిందితులు బేకరీ వద్ద ఈ కారు నుండి ఆమెను దింపి ఇన్పోవా కారులో తీసుకెళ్లారని పోలీసులు చెప్పిన విషయాన్ని Revanth Reddy గుర్తు చేశారు.

ALso Read:ఆ వాహనాల యజమానులు ఎవరో చెప్పాలి: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై రేవంత్ రెడ్డి

మే 28వ తేదీన ఘటన జరిగితే జూన్ 4వ తేదీన Innova కారును పోలీసులు సీజ్ చేశారన్నారు. ఇన్ని రోజుల పాటు కారు ఎక్కడ ఉందని రేవంత్ ప్రశ్నించారు. కారులో ఆధారాలు లేకుండా నిందితులు ప్రయత్నించేందుకు పోలీసులు సహకరించారా అని ఆయన నిలదీశారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహనాల యజమానులపై కేసులు పెట్టాలని మోటార్ వాహనాల చట్టం చెబుతుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు మైనర్లేనని సీవీ ఆనంద్ చెప్పారన్నారు. 

ఇన్నోవా కారును కూడా మైనర్లే నడిపారని సీపీ మీడియా సమావేశంలో చెప్పడాన్ని రేవంత్ గుర్తు చేశారు. మైనర్లే వాహనం నడిపితే ఈ వాహనం ఎవరిదో గుర్తించి వాహన యజమానిపై ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. బెంజ్ కారు, ఇన్నోవా వాహనాల యజమానులు ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమైతే ఈ వాహనం ఎవరికి అలాట్ చేశారో పోలీసులు చెప్పాలన్నారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఉపయోగించిన వాహనాల విషయంలో మోటార్ వాహనాల చట్టం వర్తించకపోతే 16 ఆఫ్ ఫోక్సో చట్టాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.