కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: రేవంత్ రెడ్డి

కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు.  ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

TPCC Chief Revanth Reddy demands to punish who attack on kotha prabhakar reddy lns

హైదరాబాద్: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్ధి  కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైనా కఠినంగా శిక్షించాలని  ఆయన  కోరారు.

కొత్త ప్రభాకర్ రెడ్డిపై సూరంపల్లిలో  ఇవాళ  రాజు అనే వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిపై  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటనను ఆయన విడుదల చేశారు.కాంగ్రెస్ పార్టీ హింసను ఎప్పుడు నమ్ముకోదన్నారు. 
కాంగ్రెస్ పార్టీ అహింస మూల సిద్ధాంతంగా పని చేస్తుందని చెప్పారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన సంఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ విషయంలో వెంటనే పూర్తి స్థాయి లో పారదర్శకంగా విచారణ జరిపి విషయాలను బయటపెట్టాలని ఆయన కోరారు.

దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా  కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా  సోలిపేట రామలింగారెడ్డి  విజయం సాధించారు.  అనారోగ్యంతో  రామలింగారెడ్డి మృతి చెందారు. దీంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధిపై  బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు  మరోసారి బరిలోకి దిగుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios