Asianet News TeluguAsianet News Telugu

పార్టీ ఫిరాయించి కాంట్రాక్ట్‌లు, వ్యాపారాలు.. వాళ్లపై సీబీఐ విచారణ చేయించండి : బీజేపీని కోరిన రేవంత్ రెడ్డి

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై సీబీఐ విచారణ చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అసెంబ్లీని రెండ్రోజులే నిర్వహించడం దారుణమని కేసీఆర్‌పై మండిపడ్డారు. 

tpcc chief revanth reddy demands cbi probe on leaders who leaved from congress party
Author
First Published Sep 6, 2022, 6:58 PM IST

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కాంట్రాక్ట్‌లు , వ్యాపారాలపై సీబీఐ విచారణ చేయించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 2014 నుంచి 2021 వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల ఆర్ధిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలన్నారు. కేసీఆర్ అరాచకానికి చక్రవర్తి అని రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీని రెండ్రోజులే నిర్వహించడం దారుణమని.. ఆరు నెలల్లో సభ పెట్టకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయన్న కారణంతోనే సమావేశాలు పెడుతున్నారని ఆరోపించారు. 

ఇకపోతే.. రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి రేవంత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించేందుకు ఈ ఏడాది అక్టోబర్ 24 న  కర్ణాటకలోని రాయిచూర్ నియోజకవర్గం నుండి తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర రానుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం లో రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుందని రేవంత్ రెడ్డి చెప్పారు. మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు, పటాన్ చెరు, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట, శంకరంపల్లి, మద్నూర్ మీదుగా నాందేడ్ లోకి రాహుల్ పాదయాత్ర వెళ్లనుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

ALso REad:ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకే రాహుల్ పాదయాత్ర: రేవంత్ రెడ్డి

5 రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన తర్వాత  మెదక్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్ లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుందని రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో 350 కి.మీ సాగుతుందని రాష్ట్ర ప్రజలు వందలాది మందిగా ఈ పాదయాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి కోరారు. ప్రతి రోజూ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాహుల్ గాంధీ వెంట ఉంటారని రేవంత్ రెడ్డి వివరించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios