ఉచిత విద్యుత్‌కు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్, కవితలు తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రేవంత్  

ఉచిత విద్యుత్‌కు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికి బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే గడిచిన రెండ్రోజులుగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రతి చోట రేవంత్ రెడ్డి దిష్టబొమ్మలు దగ్థం చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.

కేసీఆర్ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. ‘‘కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు.. “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా… మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్… రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్’’ .. అంటూ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

మరోవైపు.. రేవంత్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రైతుకు వ్యవసాయం మంచిగా వుండాలంటే నీళ్లు, కరెంట్ వుండాలన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలు కాపీకొడుతున్నాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన రైతు డిక్లరేషన్ ఓ బోగస్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే తప్పేంటని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, ఎక్కడా విద్యుత్ కోతలు లేవని కవిత అన్నారు. 

మరోవైపు.. రాష్ట్రంలో సాగుకు ఉచిత విద్యుత్ మూడు గంట‌లు చాలు అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా మంగళ, బుధవారాల్లో ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులను కోరింది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ వ‌ర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ను వ్యతిరేకించినందుకు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఆయ‌న పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.