పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు:మొయినాబాద్ పోలీసులకు కాంగ్రెస్ కంప్లైంట్

పార్టీ  మారిన  12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు. 

TPCC Chief Revanth Reddy Complaints against 12 Defected Congress mlas to Moinabad Police


హైదరాబాద్: పార్టీ మారిన  12 మంది ఎమ్మెల్యేలపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు  మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో  శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.2018లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా విజయం సాధించిన  12 మంది ఎమ్మెల్యేలు  బీఆర్ఎస్ లో చేరారు.  మంత్రి పదవులతో పాటు  ఇతర ప్రయోజనాల కోసం  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారని కాంగ్రెస్ ఆరోపించింది.ఈ నేపథ్యంలో పార్టీ మారిన  12 మంది ఎమ్మెల్యేలపై  మొయినాబాద్ పోలీసులకు  రేవంత్ రెడ్డి బృందం  ఇవాళ  ఫిర్యాదు చేసింది. 

నకిరేకల్ ఎమ్మెల్యే  చిరుమర్తి లింగయ్య,  పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,కొల్లాపూర్ ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, పాలేరు ఎమ్మెల్యే  కందాల ఉపేందర్ రెడ్డి,  మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్ బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,  ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కులపై  కాంగ్రెస్ పార్టీ  మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు  చేసింది.

also read:ఫిరాయింపులతో బలాన్ని పెంచుకున్నారు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురి చేశారని  గత ఏడాది అక్టోబర్  26న  కేసు నమోదైంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.   అచ్చంపేట ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు,  పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను  ముగ్గురు ప్రలోభాలకు  గురి చేసినట్టుగా కేసు నమోదైంది.  రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లపై  కేసు నమోదైంది.  తమ పార్టీ ఎమ్మెల్యేల  ప్రలోభాల వెనుక  బీజేపీ ఉందని   బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది.  

ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.  ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ  తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  దీంతో  తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఆర్ధిక ప్రయోజనంతో పాటు  ఇతర  ప్రయోజాలను ఆశగా చూపి   పార్టీలో  చేర్చుకున్నారని  కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఆ ఆరోపణలను కూడా  పోలీసులకు  ఇచ్చిన  ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీ  పేర్కొంది. 

బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుతో పాటు  సీబీఐ విచారించాలని  కాంగ్రెస్ పార్టీ కోరనుంది.  అందుకే  మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో  కాంగ్రెస్ నేతలు  ఫిర్యాదు చేశారు.ఈ విషయమై  కాంగ్రెస్ నేతలు   న్యాయ నిపుణులతో కూడా  చర్చించారు. న్యాయ నిపుణుల సూచన మేరకు  కాంగ్రెస్ నేతలు  ఇవాళ  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios