Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్‌లో టీఆర్ఎస్ డ్రామాలు: వరి ధాన్యం కొనుగోలుపై రేవంత్ రెడ్డి

పార్లమెంట్ లో టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన వరిని ఎవరు కొనుగోలు చేస్తారో చెప్పాలన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

TPCC Chief Revanth Reddy Comments on TRS Over Paddy  issue
Author
Hyderabad, First Published Nov 30, 2021, 12:42 PM IST

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో టీఆర్ఎస్ నాటకాలు ఆడతుండని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నాడు న్యూఢిల్లీలో Tpcc చీఫ్ Revanth Reddy మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కాకుండా ప్రత్యామ్నాయాలు ఏం వేయాలో రైతులకు ప్రభుత్వం ఏం చెప్పిందని ఆయన ప్రశ్నించారు.Farmers  పండించిన వరిని ఎవరు కొనాలో చెప్పాలన్నారు. Parliament లో Trs నాటకాలు ఆడుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. మోడీని రక్షించేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్నారు.ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కేసీఆర్ రైతులను కోరుతున్నారని అయితే ప్రత్యామ్నాయ పంటల విషయమై రైతులను ఏ రకంగా  సన్నద్దం చేశారో చెప్పాలని ఆయన కోరారు. మెడపై కత్తి పెట్టి బాయిల్డ్ రైస్ విషయంలో  కేంద్రం తమపై ఒత్తిడి తెస్తే  తాము ఒప్పుకొన్నామన్నారు. అయితే మెడపై కత్తి పెడితే పదవులు వదులుకొంటారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

also read:చేతకాని దద్దమ్మ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్

రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా ప్రభుత్వానికి పట్టదా అని ఆయన అడిగారు. రైతుల హక్కుల కోసం ప్రభుత్వం ఏం పట్టించుకోదా అని ఆయన ప్రశ్నించారు. సీఎంపై ఉన్న ఆరోపణలకు సంబంధించి విచారణ చేస్తామని కేంద్రం బెదిరిస్తోందా అని రేవంత్ రెడ్డి అడిగారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డిలో వేలాది కోట్ల రూపాయాలను కేసీఆర్ కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు.ఈ కుంభకోణాలను బయటకు తీస్తామని కేంద్రం బెదిరించిందా చెప్పాలన్నారు.కేంద్ర ప్రభుత్వం మెడమీద కత్తి పెట్టిందని కేసీఆర్ చెప్పారని... మెడపై కత్తి  అనే పదానికి తెలంగాణ ప్రజలకు అర్ధం చెప్పాలని ఆయన కోరారు. నీతి వంతుడిగా కేసీఆర్ చెప్పుకొంటారన్నారు. వరి ధాన్యం విషయంలో కేంద్రంపై తాడో పేడో తేల్చుకొంటామని చెప్పిన కేసీఆర్  మెడపై కత్తి పెట్టగానే ఎందుకు వెనక్కు తగ్గారో చెప్పాలన్నారు. తెలంగాణ రైతుల హక్కులను ఎందుకు తాకట్టు పెట్టావని రేవంత్ రెడ్డి  సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను మోడీ వద్ద తాకట్టు  నిన్న మీడియా సమావేశంలో రంకెలు వేస్తున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

టీఆర్ఎస్ ఎంపీలు కొందరు సభకు హాజరు కాకపోవడానికి కారణమేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనలేకపోతే వేల కోట్లతో ప్రాజెక్టులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయంపై తెలంగాణ సర్కార్ పాలసీ ఏమిటని ఆయన అడిగారు. పసుపు బోర్డు విషయంలో బీజేపీ రైతులను మోసం చేసిందన్నారు. చక్కెర పరిశ్రమలను మూసేసి కేసీఆర్ రైతులకు తీవ్ర నష్టం చేశారని ఆయన విమర్శించారు.

తెలంగాణలో  వర్షాకాలంలో రైతులు పండించిన  వరి ధాన్యంలో 20 శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన విమర్శించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  కొనుగోలు చేసేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. 45 రోజులు ఆలస్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవడం వల్ల ఇప్పటికే కేవలం 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే రైతుల నుండి కొనుగోలు చేసినట్టుగా రేవంత్ రెడ్డి వివరించారురైతులు పండించిన  పంటను అదానీ, అంబానీలకు మాత్రమే విక్రయించుకొనే అవకాశాలు మాత్రమే కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయని చెప్పారు. మూడు సాగు చట్టాలను రద్దు చేసినప్పటికీ  రైతులు అనివార్యంగా అదానీ, అంబానీలకు మాత్రమే  ధాన్యాన్ని విక్రయించుకొనే వెసులుబాటు కల్పించారన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios