Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి అరెస్ట్.. వచ్చేది సోనియా రాజ్యమేనన్న టీపీసీసీ చీఫ్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత

కేసీఆర్, మోడీ ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. హ్యాకర్లతో ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చేది సోనియా రాజ్యమని.. అది కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యమని రేవంత్ స్పష్టం చేశారు.

tpcc chief revanth reddy arrest at indira park ksp
Author
Hyderabad, First Published Jul 16, 2021, 2:20 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ టీ. కాంగ్రెస్ శుక్రవారం నిరసన కార్యక్రమం తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంబేద్కర్ విగ్రహం వైపుగా కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్నారు. దీనిని పోలీసులు  అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ధర్నా చౌక్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. అయినప్పటికీ బారికేడ్లను తోసివేసి రాజ్‌భవన్ వైపుగా కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:పెట్రోల్, డీజీల్ ధరల పెంపుపై నిరసన: రాజ్‌భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. తమకు మోడీ మీద, కేసీఆర్ మీద నమ్మకం లేదన్నారు. కేసీఆర్, మోడీ ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. హ్యాకర్లతో ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చేది సోనియా రాజ్యమని.. అది కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యమని రేవంత్ స్పష్టం చేశారు. పోలీసులు తమను ఇబ్బంది పెట్టొద్దని.. మీరు ఇబ్బంది పడొద్దని ఆయన హితవు పలికారు. కనీసం గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదని రేవంత్ మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios