Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్, డీజీల్ ధరల పెంపుపై నిరసన: రాజ్‌భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు


పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టారు. రాజ్ భవన్ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు. ఇందిరాపార్క్ వద్దే నిరసనకు పోలీసులు అనుమతిచ్చారు.
 

youth congress leaders tied party flag Raj Bhavan gate in Hyderabad lns
Author
Hyderabad, First Published Jul 16, 2021, 10:09 AM IST

హైదరాబాద్: హైద్రాబాద్‌ రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ పార్టీ నేతలు  ఆ పార్టీ జెండాలు కట్టారు.  పోలీసుల కళ్లు గళ్లుకప్పి యూత్ కాంగ్రెస్ నేతలు  జెండాలు కట్టి వెళ్లిపోయారు.పెట్రోల్, డీజీల్   ధరల పెంపును నిరసిస్తూ ఇందిరాపార్క్ నుండి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు పిలుపునిచ్చింది.  అయితే ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు ఇందిరా పార్క్ వద్ద  నిరసనకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.

&nb

sp;

 

రాజ్ భవన్ వైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొన్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టి పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోయారు.  రాజ్‌భవన్ వద్దకు నిరసన ర్యాలీ చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలో తొలిసారిగా  ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ఆందోళనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు పట్టుదలగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ నిరసన కార్యక్రమాన్ని పురస్కరించుకొని  పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios