గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి.. వేరే పార్టీలోకి వెళ్లిన నేతలు మళ్లీ సొంతపార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు సమాన ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని ఉత్తమ్ మండిపడ్డారు.

సూర్యాపేటలో బుధవారం మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ కుటుంబపాలన, దోపిడీ పాలన రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు.

Also Read:మరో పదేళ్లు కేసీఆరే సీఎం, కాంగ్రెస్‌ను ఇగ్నోర్‌ చేయలేం: కేటీఆర్ ఆసక్తికరం

కేసీఆర్‌ ఎన్నికల హామీలో చెప్పిన నిరుద్యోగ భృతి, రుణమాఫీ, రైతుబంధు ఎక్కడ అని ఉత్తమ్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ అంశాలను ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ పార్టీని ఎండగతామన్నారు.

Also Read:నమ్మక ద్రోహం చేసిన వారు బాగుపడరు: ఈటల మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

తాను మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడితే.. తనపై టీఆర్ఎస్ నేతలు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. రిజర్వేషన్లు ముగిశాక నామినేషన్లకు వారం రోజుల గడువు ఇవ్వాలని.. కేసీఆర్, మోడీ ఇద్దరూ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పోలీస్ బలంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేస్తున్నారని.. ఇందుకు నిరసనగా త్వరలోనే జైల్ బరో నిర్వహిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.