Asianet News TeluguAsianet News Telugu

ఫెడరల్ ఫ్రంట్ హడావిడి ఏమైందో, మౌనం ఎందుకో : కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు

గతంలో ప్రాంతీయ నేతల మద్దతు కూడగడతానంటూ పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కలిసిన నేతల తరపున పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి విముఖత చూపారంటే అర్థమవుతుందన్నారు. 

tpcc campaign committee chairman vijayashanti comments on kcr
Author
Hyderabad, First Published Apr 19, 2019, 6:30 PM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ కాంపైనింగ్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి నిప్పులు చెరిగారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానని చెప్పి తిరిగిన కేసీఆర్ ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు మౌనంగా ఉన్నారో అంటూ సెటైర్లు వేశారు. 

ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానంటూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్నాటక రాష్ట్రాలలో వరుస భేటీలు నిర్వహించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అంతుబట్టడం లేదని ప్రశ్నించారు. 

తమిళనాడుకు వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేసి,ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతను అక్కడి ప్రజలకు వివరించి ఉండొచ్చు కదా అని సూచించారు. 

పశ్చిమబంగలో కూడా పర్యటించిన కేసీఆర్ మమతాబెనర్జీని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. మమతా బెనర్జీతో కలిసి ప్రచారం చేస్తే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పే అంశంపై క్లారిటీ వచ్చేదని విమర్శించారు. 

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు తెలపడంతో పాటు టీఆరెస్ ప్రభుత్వ పథకాలను జేడీఎస్ కాపీ కొట్టడం వల్లే కుమారస్వామి సీఎం అయ్యారని కేసీఆర్ అప్పట్లో ప్రచారం చేసుకున్నారని రాములమ్మ గుర్తు చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో పక్కనుండి కుమారస్వామిని గెలిపించానని చెప్పుకున్న కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటక వైపు ఎందుకు చూడటం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిందని విమర్శించారు. 

గతంలో ప్రాంతీయ నేతల మద్దతు కూడగడతానంటూ పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కలిసిన నేతల తరపున పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి విముఖత చూపారంటే అర్థమవుతుందన్నారు. 

కేసీఆర్ మాట ఫెడరల్ ఫ్రంట్ వైపు ఉంటే మనిషి మాత్రం మోదీ నేతృత్వంలోని బీజేపీ వైపు ఉన్నారన్న విషయంపై క్లారిటీ వచ్చేసిందన్నారు. కొన్ని విషయాలను ఎంత దాచాలన్నా దాగవంటూ సెటైర్లు వేశారు విజయశాంతి.  

 

Follow Us:
Download App:
  • android
  • ios