ఆదిలాబాద్‌లో టమాటా లోడ్‌తో వెళ్లుతున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సుమారు రూ. 28 లక్షల విలువైన టమాటాలను కర్ణాటక నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా ఆదిలాబాద్‌లో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఆ టమాటాలకు కాపలాగా చేరడం గమనార్హం. 

హైదరాబాద్: ఆదిలాబాద్‌లో టమాట లోడ్‌తో వెళ్లుతున్న లారీ బోల్తా పడింది. ఆదిలాబాద్ జిల్లా మావల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి ఢిల్లీకి వెళ్లుతున్న ఈ లారీ జాతీయ రహదారిపై బోల్తా పడింది. అందులోని వ్యక్తులు తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నారు. వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. సుమారు రూ. 28 లక్షల విలువైన టమాటాలను ఈ లారీ మోసుకెళ్లుతున్నట్టు తెలిసింది.

Also Read: Tomatoes: టమాటలు అమ్మి నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. ఎక్కడంటే?

దేశం మొత్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ఈ లారీ బోల్తా పడటంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి మొత్తం ఎత్తుకెళ్లిపోతారని వారు భయపడ్డారు. దీంతో వెంటనే వారు పోలీసుల సహకారం తీసుకున్నారు. పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ఆ లారీకి, కిందపడిపోయిన టమాటాలకు కాపలాగా ఉన్నారు. లారీ యజమాని అభ్యర్థన మేరకు పోలీసులు వారి లోడ్‌ ఇతరులకు చేరకుండా రక్షించగలిగారు.

మహారాష్ట్ర పూణె జిల్లాలో టమాట సాగు చేసిన రైతులు జాక్ పాట్ కొట్టేశారు. పంట చేతికి రాగానే మార్కెట్‌లో ధరలు వారికి అనుకూలంగా మారడంతో చాలా మంది లక్షాధికారులయ్యారు. కొందరు కోటీశ్వరులూ అయ్యారు. పూణెలోని తుకారాం భాగోజీ గయాకర్ నెల రోజుల్లోనే కోటిన్నర సంపాదించాడు.