Asianet News TeluguAsianet News Telugu

రూ. 2.9 కోట్లు ఎగ్గొట్టింది: శిల్పా చౌదరిపై హీరో భార్య ఫిర్యాదు

శిల్పా చౌదరి తన నుండి రూ. 2.9 కోట్లు తీసుకొని మోసం చేసిందని ప్రముఖ సినీ హీరో భార్య నార్సింగి పోలీసులకు బుధవారం నాడు ఫిర్యాదు చేసింది.

Tollywood Hero's wife complaints against  Shilpa chowdary
Author
Hyderabad, First Published Dec 1, 2021, 5:32 PM IST

 శిల్పా చౌదరిపై ఓ ప్రముఖ సినీ నటి భార్య  బుధవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 2.9 కోట్లను తీసుకొందని  నార్సింగి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. శిల్పా చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదులు చేస్తున్నారు. కిట్టి పార్టీలలో Shilpa chowdary   పరిచయమైందని హీరోయిన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళల నుండి ఆమె భారీగా డబ్బులు వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు. Narsingi police పోలీస్ స్టేషన్ లో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. శిల్పా చౌదరిని తిరిగి కస్టడీలోకి తీసుకొంటామని Madhapur డీసీపీ తెలిపారు. కస్టడీ పిటిషన్ పై ఇవాళ కోర్టులో వాదనలు పూర్తయ్యాయన్నారు. శిల్పాకు చెందిన రెండు అకౌంట్లను ఫ్రీజ్ చేశామని మాదాపూర్ డీసీపీ తెలిపారు. మరికొన్ని అకౌంట్లు  కూడా శిల్పా చౌదరికి ఉన్నట్టుగా గుర్తించామని మాదాపూర్ పోలీసులు తెలిపారు. అయితే డబ్బులను శిల్పా చౌదరి ఎక్కడికి తరలించిందనే విషయమై ఆరా తీస్తున్నామని మాదాపూర్ డీసీపీ తెలిపారు. 

కిట్టీ పార్టీల పేరుతో కోట్లాది రూపాయాలను శిల్పా చౌదరి వసూలు చేశారని పోలీసులు గుర్తించారు.వీకేండ్ పార్టీలు ఇచ్చి పలువురు బాలీవుడ్ హీరోలతో పరిచయాలు పెంచుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.  హైద్రాబాద్, కర్నూల్, విజయవాడ, కర్నూల్ ప్రాంతాలకు చెందిన సంపన్న మహిళలతో Kitty partyలు  ఏర్పాటు చేసేది. ఇలా పార్టీలకు వచ్చిన వారితో పరిచయం పెంచుకొని  వారి నుండి డబ్బులు వసూలు చేసినట్టుగా బాధితులు  తెలిపారు.  సినీ ప్రొడ్యూసర్ అని అంటూ ఆమె పరిచయం చేసుకొందని  కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read:Shilpa Chowdary: శిల్పా చౌదరి వలలో టాలీవుడ్ హీరోలు.. వీకెండ్ పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలతో స్నేహం పెంచుకుని..

రోహిణి అనే బాధితురాలు  శిల్పా చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు  శిల్పా చౌదరి అరెస్ట్ చేయడంతో బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు.శిల్పా బాధితుల్లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫేజ్ త్రీ పార్టీల పేరుతో సెలబ్రిటీలను ఆకర్షించిన  ఆమె అధిక వడ్డీ రేట్లు ఇస్తానని చెప్పి రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు దండుకుని మోసం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.  తన బంధువుకు చెందిన ఉన్నత పాఠశాలలో పెట్టుబడి పెడతానని మాయమాటలు చెప్పి కొందరి నుంచి డబ్బులు సేకరించింది. అలాగే అధిక వడ్డీకి హామీ ఇచ్చి పలువురి నుంచి కోట్లాది రూపాయలు డబ్బు వసూలు చేసింది.సినీ ప్రముఖులే కాదు అధికారుల కుటుంబాలను కూడా శిల్పా చౌదరి డబ్బులు వసూలు చేసిందనే ప్రచారం కూడా సాగుతుంది.  శిల్పా చౌదరి బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిల్పా చౌదరి ఎవరెవరిని మోసం చేసిందనే విషయమై పోలీసులు విచారణ చేయనున్నారు. అయితే ఆమె నుండి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు గాను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios