Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో సర్వాంగసుందరంగా ముస్తాబైన టీ-హబ్ 2.0... నేడే ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టి‌-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (మంగళవాారం) ప్రారంభించనున్నారు. 

Today CM KCR Inaugurates Second Phase of T-Hub in Hyderabad
Author
Hyderabad, First Published Jun 28, 2022, 10:02 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం బడా పెట్టుబడిదారులను ఆకర్షించడమే కాదు మంచి ఆలోచనలతో వచ్చే స్టార్టప్ లనూ ప్రోత్సహిస్తోంది. ఇందుకోసమే ఏడేళ్ళ క్రితమే (2015) టి‌-హబ్ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్ సెంటర్ ను రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటుచేసింది. దీన్ని మరింత విస్తరిసతూ టి-హబ్ 2.0 ఐటీ హబ్ మాదాపూర్ లో అత్యాధునిక సౌకర్యాలు, హంగులతో కేసీఆర్ సర్కార్ ఏర్పాటుచేసింది. 18 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రాన్ని ఇవాళ (మంగళవారం) సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. 

ఈ ఇన్నోవేషన్ క్యాంపస్‌లో టి-వర్క్స్  పేరిట భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ మరియు ఇమేజ్ (ఇన్నోవేషన్ ఇన్ మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ & ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఇన్నోవేషన్) టవర్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది.

Today CM KCR Inaugurates Second Phase of T-Hub in Hyderabad
‌-
టి‌-హబ్ సరికొత్త రూపాన్ని సంతరించుకుని టీ‌-హబ్ ఫేజ్2 గా ఆవిష్కరించబడింది. పది అంతస్తులతో T ఆకారంలో టీ‌‌- హబ్ భవనం చూడగానే ఆకర్షించేలా అద్భుతంగా నిర్మితమైంది. 3.75 లక్షల చదరపు అడుగుల్లో కాంక్రీట్, స్టీల్, గ్లాస్ సమ్మేళనంగా అంతరిక్ష నౌకను తలపించేలా నిర్మితమైన ఈ టీ‌-హబ్ భవనాన్ని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ అర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసింది. 

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రూ.400 కోట్ల నిధులను టీ-హబ్ నిర్మాణానికి కేటాయించినట్లు తెలంగాణ ఐటీ & పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. టి-హబ్ ఫేజ్1 కంటే తాజాగా ఏర్పాటుచేసిన ఫేజ్2 ఐదురెట్లు పెద్దదని తెలిపారు. దాదాపు 4,000 స్టార్టప్స్ ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే సామర్థ్యం టి‌-హబ్ కు వుంది.  45దేశాలకు చెందిన ట్రేడ్ ఆఫీస్, వెంచర్ క్యాపిటల్ ఫండ్,  ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ తదితర సదుపాయాలు టి-హబ్ కలిగివుంది. 

Today CM KCR Inaugurates Second Phase of T-Hub in Hyderabad

ఇక స్టార్టప్ ఇండియా మిషన్ కింద సైన్స్ ఆండ్ టెక్నాలజీ విభాగం సహకారంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెంటర్ కూడా టి‌-హబ్ లో ఏర్పాటు చేసినట్లు జయేశ్ రంజన్ తెలిపారు.   హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ క్యాంపన్ లో టి-హబ్ ఫేజ్1 లో కొనసాగుతున్న  200 స్టార్టప్స్ జూలై 1వ తేదీ నుండి టి-హబ్ ఫేజ్2 కార్యకలాపాలు ప్రారంభంకాగానే కొత్త భవనంలోకి మారతాయన్నారు. ఇప్పటికే టి-హబ్ దాదాపు 1,100 స్టార్టప్‌లకు ఇంక్యుబేట్ చేయడంలో సహాయపడిందని... అవి సుమారు 10,000 కోట్లను సమీకరించాయని జయేశ్ రంజన్ తెలిపారు. 

ఇక టి-హబ్ సీఈవో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... టీ-హబ్ ఫేజ్2 భవనంలో ఓ అంతస్తు మొత్తాన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ కోసమే కేటాయించామన్నారు. ఇది హైదరాబాద్ లో స్టార్టప్స్ ఏర్పాటుకు ఎంతో ఊతమిస్తుందని శ్రీనివాస్ రావు అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios