తెలంగాణ కరోనా అప్ డేట్: పెరిగిన కేసులు తగ్గిన రికవరీ... ఆందోళనకరంగా యాక్టివ్ కేసులు
తెలంగాణలో పాజిటివ్ కేసుల కంటే రికవరీ అయిన వారి సంఖ్య తక్కువగా వుండటంతో రోజురోజుకు యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా(బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 46,90మందికి టెస్టులు చేయగా 1602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 4531153కు చేరగా కేసుల సంఖ్య 2,47,284కు చేరింది.
ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందినవారిలో తాజాగా 982మది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుండి సురక్షితంగా బయటపడివారి సంఖ్య 2,26,646కు చేరింది. ఇక ఈ మహమ్మారి కారణంగా తాజాగా నలుగురు మృతిచెందగా రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1366కు చేరింది.
telangana తెలంగాణ కరోనా అప్ డేట్: ఆందోళనకరం...రోజురోజుకు పెరుగుతున్న యాక్టివ్ కేసులు
రాష్ట్రంలో రికవరీ రేటు 91.65శాతంగా వుంటే దేశంలో ఇది 92.3శాతంగా వుంది. మరణాల రేటు రాష్ట్రంలో 0.55శాతం వుంటే దేశంలో 1.5శాతంగా వున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
జిల్లాలవారిగా చూసుకుంటే అత్యధికంగా జిహెచ్ఎంసీ(హైదరాబాద్)పరిధిలో 295కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం 77, కరీంనగర్ 76, ఖమ్మం 79, మేడ్చల్ 1377, నల్గొండ 79, రంగారెడ్డి 118 కేసులు బయటపడ్డాయి. మిగతా జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగా వున్నాయి.
పూర్తి వివరాలు: