హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు బయటనడ్డ మొత్తం కేసుల సంఖ్య 1,95,609కి చేరింది. 

 ఇప్పటికే కరోనా బారినపడిన వారిలోంచి 2,437మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇలా గత 24గంటల్లో రికవరీ అయిన వారితో కలుపుకుని మొత్తం రికవరీల సంఖ్య 1,65,844కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,620కి చేరింది. 

ఇక గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో 10మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు నమోదయిన మరణాల సంఖ్య 1145కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు(0.58శాతం) కేంద్ర మరణాల రేటు(1.6శాతం)కంటే ఎక్కువగా వుంది. రికవరీల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 83.5శాతంగా వుంటే రాష్ట్రంలో అది 84.78శాతంగా వుంది. 

గత 24గంటల్లో 54,098 కరోనా టెస్టులు నిర్వహించగా 2వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ టెస్టులతో కలుపుకుని మొత్తం టెస్టుల సంఖ్య 31,04,542కి చేరింది. 

జిల్లాల వారిగా చూసుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో 293 కేసులు బయటపడ్డాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం 77, కామారెడ్డి 63, కరీంనగర్ 114, ఖమ్మం 104, మేడ్చల్ 173, నల్గొండ 109, నిజామాబాద్ 63, సిరిసిల్ల 52, రంగారెడ్డి 171, సంగారెడ్డి 55, సిద్దిపేట 60, సూర్యాపేట 77, వరంగల్ అర్బన్ 72 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో కాస్త తక్కువగానే కేసులు నమోదయ్యాయి.