హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గముఖం పట్టాయి. గత 24 గంటల్లో(సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 40,081 పరీక్షలు నిర్వహించగా 1481 కేసులు బయటపడ్డట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 41,55,597 చేరగా కేసుల సంఖ్య 2,34,152కి చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడ్డ వారిలో తాజాగా 1451 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డ వారి సంఖ్య 2,14,917కు చేరింది. అయితే గత 24గంటల్లో కరోనా కారణంగా నలుగురు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1319కి చేరింది.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.56శాతంగా వుండగా దేశంలో ఇది 1.5శాతంగా వుంది. ఇక రికవరీ రేటు రాష్ట్రంలో 91.78శాతంగా వుంటే దేశంలో మాత్రం 90.7శాతంగా వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా  17,916 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నాయి. 

జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్) లో అత్యధికంగా 279కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం 79, కరీంనగర్ 9, ఖమ్మం 82, మేడ్చల్ 138, నల్గొండ 82, రంగారెడ్డి 111 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య నామమాత్రంగానే వున్నాయి. 

పూర్తి వివరాలు: