హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉదృతి మెల్లిగా తగ్గుతూ వస్తోంది. గతంలో ప్రతికోజూ 2వేలకు పైగా నమోదయిన కేసులు ఇప్పుడు వెయ్యికి అటూఇటుగా నమోదవుతున్నాయి. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,280మందికి పరీక్షలు నిర్వహించగా 1,273 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 40,52,633కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 2,30,224కి చేరుకున్నాయి. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 1,708మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య ఐదుగురు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1303కి చేరింది. 

తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 90.7శాతం వుంటే దేశంలో అది 89.7శాతంగా వుంది. అలాగే మరణాల రేటు రాష్ట్రంలో 0.56శాతంగా వుంటే దేశంలో 1.5శాతంగా వున్నట్లు వైద్యారోగ్య  శాఖ ప్రకటించింది. 

జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్)లో 227, మేడ్చల్ 104, రంగారెడ్డి 102, భద్రాద్రి కొత్తగూడెం 69, కరీంనగర్ 55, ఖమ్మం 75, వరంగల్ అర్బన్ 51, నల్గొండ 76 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా వుంది.