తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ జిల్లాల్లోనే అత్యధిక కేసులు, మిగతా జిల్లాల్లో నామమాత్రం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యాయి. 

Today 24th november telangana corona cases

హైదరాబాద్: గత 24గంటల్లో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి ఎనిమిది గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 42,748మందికి టెస్టులు చేయగా కేవలం 921 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన మొత్తం టెస్టుల సంఖ్య 52,01,214 కు చేరితే మొత్తం కేసుల సంఖ్య 2,65,049కి చేరాయి. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1097 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,52,565కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,047కు తగ్గాయి.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1437కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 95.28 శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 146కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 81, రంగారెడ్డి 61, భద్రాద్రి కొత్తగూడెం 71, కరీంనగర్ 44, ఖమ్మం36,   సంగారెడ్డి 17, సిద్దిపేట 18, సూర్యాపేట 31, వరంగల్ అర్బన్ 45, నల్గొండ 49, మంచిర్యాల 18, జగిత్యాల 50, పెద్దపల్లి 29, సిరిసిల్ల 27 కేసులు నమోదయ్యాయి.  

పూర్తి వివరాలు:

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios