తెలంగాణ రాష్ట్రం కరోనా మహమ్మారి కోరల్లోంచి మెల్లిగా బయటపడుతోంది. గతకొద్దిరోజులుగా అతి తక్కువగా కేసులు నమోదవుతుండగా రికవరీలు అధికంగా వుంటున్నాయి.  

హైదరాబాద్: తెలంగాణలో గతకొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24 గంటల్లో(ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 45,227మందికి టెస్ట్ చేయగా 617పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 2,82,347కు చేరగా టెస్టుల సంఖ్య 65,20,993కు చేరాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 635 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,74,260కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 6,569యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1518కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.6శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.13శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేట 1, కామారెడ్డి 3, జోగులాంబ గద్వాల 4, ఆదిలాబాద్ 11, భూపాలపల్లి 7, జనగామ 8, జగిత్యాల 18, వనపర్తి 6, అసిఫాబాద్ 5, మహబూబ్ నగర్ 7, మహబూబాబాద్ 10, మెదక్ 4, నాగర్ కర్నూల్ 12, నిర్మల్ 5, నిజామాబాద్ 12, సిరిసిల్ల 11, వికారాబాద్ 6, వరంగల్ రూరల్ 10, ములుగు 8, పెద్దపల్లి 20, సిద్దిపేట 17, సూర్యాపేట 22, భువనగిరి 8, మంచిర్యాల 16, నల్గొండ 15 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 103కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 52, రంగారెడ్డి 51, కొత్తగూడెం 30, కరీంనగర్ 41, ఖమ్మం 32, సంగారెడ్డి 21, వరంగల్ అర్బన్ 41కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

Scroll to load tweet…