తెలంగాణ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో కేవలం 5,815 యాక్టివ్ కేసులు
తెలంగాణలో రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా తగ్గాయి.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. తాజాగా గత 24గంటల్లో(బుధవారం రాత్రి 8 గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 42,013మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 461మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,86,815కు చేరితే టెస్టుల సంఖ్య 69,24,707కు చేరాయి.
ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 461 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,79,456కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5,815 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 3,674గా వుంది.
ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1544కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.1శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.43శాతంగా వుంది.
జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే జోగులాంబ గద్వాల 3, నారాయణపేట 2, కామారెడ్డి 6, ఆదిలాబాద్ 6, భూపాలపల్లి 3, జనగామ 7, జగిత్యాల 10, వనపర్తి 5, అసిఫాబాద్ 3, మహబూబ్ నగర్ 5, మహబూబాబాద్ 5, మెదక్ 6, నాగర్ కర్నూల్ 7, నిర్మల్ 3, నిజామాబాద్ 13, సిరిసిల్ల 6, వికారాబాద్ 4, వరంగల్ రూరల్ 8, ములుగు 4, పెద్దపల్లి 11, సిద్దిపేట 10, సూర్యాపేట 15, భువనగిరి 9, మంచిర్యాల 12, నల్గొండ 14 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 108కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 41, రంగారెడ్డి 44, కొత్తగూడెం 12, కరీంనగర్ 31, ఖమ్మం 11, సంగారెడ్డి 15, వరంగల్ అర్బన్ 22కేసులు నమోదయ్యాయి.
పూర్తి వివరాలు: