తెలంగాణ కరోనా అప్ డేట్: భారీగా తగ్గిన కేసులు, మరణాలు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తాజాగా గణనీయంగా తగ్గింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గుముఖం పట్టింది. చాలారోజుల తర్వాత వెయ్యికి తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26,027మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం 948మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు చేపట్టిన పరీక్షల సంఖ్య 38,56,530కి చేరుకోగా కేసుల సంఖ్య 2,23,059కి చేరింది.
ఇక ఇప్పటికే కరోనాబారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 1896మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,00,686కు చేరింది. తాజాగా కరోనా మరణాలు కూడా చాలా తగ్గాయి. 24గంటల్లో కేవలం నలుగురు మాత్రమే మృతిచెందారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.57, రికవరీ రేటు 89.96శాతంగా వుంటే కేంద్రంలో ఇవి 1.5, 88.2శాతంగా వున్నాయి. ఇప్పటివరకు నమోదయిన కేసుల్లోంచి రికవరీ అయిన వారిని తీసివేస్తే రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,098గా వుంది.
జిల్లాల వారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్)లో అత్యధికంగా 212 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి 98, మేడ్చల్ 65, భద్రాద్రి కొత్తగూడెం 56, కరీంనగర్ 63, సిద్దిపేట 54 కేసులు బయటపడ్డాయి. మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా వుంది.
పూర్తి సమాచారం: