జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే కరోనా వైరస్ కేసులు ఎక్కువగా బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో(మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 38,757మందికి టెస్టులు చేయగా 1058 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 50,11,164కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 2,60,837కు చేరింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1440 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,46,733కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,682కి చేరింది. 

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1419కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.6శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 94.59శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 168కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 93, రంగారెడ్డి 91, భద్రాద్రి కొత్తగూడెం 58, కరీంనగర్ 53, ఖమ్మం 36, నాగర్ కర్నూల్ 37, నిజామాబాద్ 16, సంగారెడ్డి 47, సిద్దిపేట 29, సూర్యాపేట 35, వరంగల్ అర్బన్ 35, పెద్దపల్లి 25, నల్గొండ 43, మంచిర్యాల 37, జగిత్యాల 36కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

Scroll to load tweet…