సమస్యల్లో ఉన్నపుడు రాజకీయ క్రీడ ఆడడం కేసీఆర్ కు అలవాటు:టీజేఎస్ చీఫ్ కోదండరామ్
సమస్యల్లో ఉన్నప్పుడు రాజకీయ క్రీడ ఆడడం కేసీఆర్ కు అలవాటేనని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. కేసీఆర్ వ్యూహంలో చిక్కుకోవద్దని విపక్షాలకు కోదండరామ్ సూచించారు.
హైదరాబాద్: 'సమస్యలలో ఉన్నప్పుడు రాజకీయ క్రీడ ఆడడం KCR కు అలవాటేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ Kodandaram చెప్పారు.మంగళవారం నాడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎబీఎన్ చానెల్ తో మాట్లాడారు. తాను సమస్యల్లో రాజకీయ అంశాలను తెరమీదకి తీసుకు వచ్చి లబ్ది పొందుతుంటాడన్నారు. విపక్షాలు కేసీఆర్ వ్యూహంలో చిక్కుకోవద్దని ఆయన సూచించారు. 2018లో కేసీఆర్ ను ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఎవరూ కోరారని ఆయన ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో TJS పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో TRS అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటనల పరిశ్రమ కుప్పకూలిందన్నారు. రెండు కంపెనీలకు తప్ప ఇతరులకు ప్రకటనలు ఇవ్వడం లేదని కోదండరామ్ చెప్పారు., చిన్న కంపెనీలకు కూడా ప్రకటనలు ఇవ్వాని ఆయన డిమాండ్ చేశారు.
తేదీ సూచిస్తే అసెంబ్లీని రద్దు చేస్తానని ఈ నెల 10వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనపై విపక్షాలు కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చాయి. ముందస్తు ఎన్నికలకు తాము కూడా సిద్దమేనని విపక్షాలు ప్రకటించాయి. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా తాము సిద్దమేనని బీజేపీ ప్రకటించింది. బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా స్పందించారు.
అసెంబ్లీని రద్దు చేయాలన్నారు. సీఎంగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయకుండా తమను తేదీ చెప్పాలని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినతా కాంగ్రెస్ పార్టీ 70 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మరో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సోమవారం నాడు సాయంత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. నాలుగు రోజుల్లో అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గడువిచ్చారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ పీడను వదిలించుకొనేందుకు సిద్దమయ్యారన్నారు. ధైర్యవంతుడివైతే నాలుగు రోజుల్లో అసెంబ్లీని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో రాహుల్ గాంధీ సభ తర్వాత టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. వరంగల్ డిక్లరేషన్ రైతుల్లో తమకు మంచి ఆదరణ వస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతోందని టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని సర్వే రిపోర్టులున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు.ఈ కారణంగానే కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.