హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించనుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలపై నిర్వహించిన సర్వేల్లో టీఆర్ఎస్ హవా కనబరుస్తుందని స్పష్టం చేసింది. 

తాజాగా టైమ్స్ నౌ- వీఎంఆర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ పార్టీ పది పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల్లో విజయఢంకా మోగిస్తోందని పేర్కొంది. అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. 

ఇకపోతే బీజేపీ రెండు స్థానాల్లో లేదా ఒక స్థానంలో విజయం సాధిస్తోందని తెలిపింది. ఇకపోతే ఒక స్థానంలో ఇతరులు గెలుచుకుంటారని పేర్కొంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 12 సీట్లలో విజయం సాధించింది. అయితే ఈసారి రెండు స్థానాలను కోల్పోతుందని తెలిపింది. 

అటు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రెండు స్థానాలను గెలవగా ఈసారి 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇకపోతే భారతీయ జనతాపార్టీ గత ఎన్నికల్లో ఒక స్థానం గెలవగా ఈసారి రెండు స్థానాలు గెలవబోతున్నట్లు తెలిపింది. 

అలాగే హైదరాబాద్ నుంచి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందగా మళ్లీ ఆయన గెలుపొందుతారని తెలిపింది. ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. ఈఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. ఇకపోతే ఈఫలితాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే ఫలితాలని సర్వే సంస్థ స్పష్టం చేసింది.