మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో బొలెరో వాహనాన్ని డంపర్ ఎక్కింది.దీంతో ముగ్గురు మరణించారు. ఎమర్జెన్సీ పనుల కోసం తిరిగే బొలెరోపై డంపర్ ప్రమాదవశాత్తు ఎక్కడంతో ప్రమాదం చోటు చేసుకొంది.
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్ కాస్ట్‌లో బుధవారం నాడు జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఓపెన్‌కాస్ట్‌లో ఎమర్జెన్సీ పనుల నిర్వహణ కోసం బొలెరో వాహనాన్ని ఉపయోగిస్తారు.
అయితే బొలెరో వాహనంపై డంపర్ ఎక్కింది. దీంతో బొలెరో వాహనంలోని ముగ్గురు మరణించారు. డంపర్ ఎక్కడంతో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. దీంతో వెల్డింగ్ చేసి మృతదేహాలను వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
