వరంగల్‌లో భారీ వర్షాలు: ముగ్గురు విద్యార్థులు, బైక్‌పై మరొకరిని కాపాడిన స్థానికులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురు విద్యార్థులను స్థానికులు కాపాడారు. మరో వైపు మొండ్రాయి వద్ద లో లెవల్ వంతెనపై బైక్ సహా ఓ వ్యక్తి కొట్టుకుపోతున్న సమయంలో స్థానికులు కాపాడారు.
 

three students rescued from flood water in Warangal district

వరంగల్: వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు విద్యార్ధులను స్థానికులు సోమవారం నాడు కాపాడారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకొంది.దామెర మండలం పసరగొండ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు స్కూల్ నుండి ఇంటికి వస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది.

ఈ వర్షానికి లోలెవల్ వంతెన నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద నీటిని దాటే క్రమంలో ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోయారు.  పక్కనే ఉన్న పొదల్లో విద్యార్థులు చిక్కుకొన్నారు. పొదలను పట్టుకొని విద్యార్థులు కేకలు వేశారు. ఈ కేకలు విన్న స్థానికులు తాళ్లు వేసి విద్యార్థులను కాపాడారు.

మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి పల్లారుగూడ రహదారిపై ఉన్న లో లెవల్ వంతెన పై ఓ బైక్ సహా ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. స్థానికులు అతడికి తాడు అందించి కాపాడారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా కలెక్టర్ అధికారులను  అప్రమత్తం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios