వరంగల్ రైల్వేస్టేషన్ లో శుక్రవారంనాడు వాటర్ ట్యాంక్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు

వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ లో శుక్రవారంనాడు వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారంపై ప్రయాణీకులపై వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణీకులు గాయపడ్డారు.గాయపడిన ముగ్గురు ప్రయాణీకులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

2016లో కూడ ఇదే తరహాలో వరంగల్ రైల్వే స్టేషన్ లో వాటర్ ట్యాంక్ కూలింది. ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిపోయింది. ట్యాంక్ లోని నీళ్లన్నీ వరంగల్ రైల్వే స్టేషన్ లోని ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారంపై నీళ్లు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

2016లో జరిగిన తరహాలోనే ఇవాళ కూడ ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.