ఆసిఫాబాద్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు.

జిల్లాలోని చింతలమానపల్లి మండలం బూరపల్లిలో విషాదం చోటు చేసుకొంది. ప్రాణహిత నదిలో భార్య, కూతురు ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయం తెలుసుకొన్న భర్త కూడ ఇదే నదిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలిసిన మృతుల బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏ విషయమై గొడవ జరిగిందనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మృతదేహాల కోసం ప్రాణహిత నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను దొరికిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.