జనగామ జిల్లా దేవరుప్పల పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, డీసీఎం వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మృతులు మహబూబాబాద్‌కు చెందిన పెనుగొండ గణేష్(60), పెనుగొండ సుకన్య(38), ఎండి.నజీర్(డ్రైవర్)గా గుర్తించారు. పెనుగొండ మంజూష, శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.