కొమరంభీం జిల్లా జక్కుపల్లిలో భూతగాదాలతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

కొమరంభీం జిల్లా జక్కుపల్లిలో దారుణం జరిగింది. భూతగాదాలతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కత్తులు, కర్రలతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను బతుకమ్మ, లింగయ్య, నర్సయ్యగా గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.