పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. సంబరాల్లో మునగాల్సిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడా గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. పెళ్లి జరగుతున్న ఇంటికి ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు దేవడా గ్రామానికి చెందిన తుకారం, బిచ్కుంద వాసి సాయిలు, మద్నూర్ కు చెందిన శంకర్ గా గుర్తించారు.