ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన మెదక్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యాన్ లో గంభీరావుపేటకు వెళ్తుండగా  ఈ ప్రమాదం జరిగింది. మృతులను గంభీరావుట మండల వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.