Asianet News TeluguAsianet News Telugu

ఘోర ప్ర‌మాదం.. ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి ముగ్గురు మృతి

Sangareddy: సంగారెడ్డిలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. సదాశివపేట మండలం కొల్కూరు గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సింగూరు కాలువ మీదుగా వెళ్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి కాలువ‌లో బోల్తా ప‌డింది. దీంతో వారు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. 

Three killed as tractor overturns, Sadashivapet, Sangareddy RMA
Author
First Published Oct 21, 2023, 5:18 PM IST

Sadasivapet tractor crash: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరు గ్రామం వద్ద శనివారం ట్రాక్టర్‌ ట్యాంకులోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు మంగళి గోపాల్ (30), ఈటల రమణ (45), యెంపల్లి రమేష్ (30)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్ పై వెళ్తుండ‌గా, టాక్ట‌ర్ కాలువ‌లోకి దూసుకెళ్ల‌డంతో బోల్తా ప‌డింది. దీంతో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

దీని గురించి స్థానికులు వివ‌రిస్తూ.. ఈటల రమణకి చెందిన ట్రాక్టర్ ట్రాలీ టైర్ పంక్చర్ కావ‌డంతో ఈ టైర్ ను గోపాల్ కు చెందినా ట్రాక్టర్ లో వేసుకొని సదాశివపేటలో పంక్చర్ వేయించడానికి ముగ్గురు కలిసి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే సింగూరు కాలువ మీదుగా వెళ్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి కాలువ‌లో బోల్తా ప‌డింది. దీంతో వారు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. 

ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదంలో ఒక‌రు మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద శుక్రవారం సాయంత్రం టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఇంకా అత‌ని పూర్తి వివ‌రాలు తెలియ‌రాలేదు. రోడ్డు దాటుతుండగా ఇబ్రహీంపట్నం రోడ్డులోని శృతి గార్డెన్ సమీపంలో ఇబ్రహీంపట్నం బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది . సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios