హైదరాబాద్:తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన ముగ్గురు న్యాయమూర్తులతో హైకోర్టు చీఫ్ జస్టిస్ సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేయించారు.

సుప్రీంకోర్టు కొలిజీయం తెలంగాణకు ముగ్గురు న్యాయమూర్తులను కేటాయించింది.  కొత్తగా తెలంగాణ హైకోర్టుకు నియమించిన న్యాయమూర్తులతో సోమవారం నాడు హైకోర్టు  చీఫ్ జస్టిస్   ప్రమాణం చేయించారు.హైకోర్టులో సోమవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు న్యాయమూర్తులతో ఆయన ప్రమాణం చేయించారు.

జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్ గౌడ్ లను సుప్రీంకోర్టు కొలిజియం తెలంగాణకు  కేటాయించింది. కొలిజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో సోమవారం నాడు ఈ ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణం చేశారు.